హిందూ శాస్త్రాలలో పాదరసం ప్రాముఖ్యత – మహిమలు:
పూర్వం దేవతల కాలంనుంచి పాదరసానికి ఎంతో ప్రత్యేకత వుంది. పాదరసం అసలు పేరు ‘‘ఏఅసరాజు’’. ఇది చూడడానికి దేవతామూర్తుల రూపంలో కనువిందు చేస్తుంటుంది. ప్రాచీనకాలంలో ఈ పాదరసంతో తయారుచేయబడిన విగ్రహాలను గృహాల్లో నిర్మించుకుని ఎంతో ఆధ్మాత్మికంగా పూజించుకునేవారు. శివలింగం, లక్ష్మీ, గణేశ, దుర్గ మొదలైన దేవతా మూర్తుల రూపంలో పాదరస విగ్రహాలను ఇంట్లో పెట్టుకుని పూజిస్తే.. మంచి సమృద్ధితోపాటు సుఖశాంతులతో కూడిన జీవితాన్ని పొందవచ్చు. అంతేకాకుండా ధర్మ, అర్థ, కామ, మోక్షాలు అనే నాలుగు పురుషార్థాలు కూడా సిద్ధిస్తాయి. మానవ జీవితంలో భౌతికంగా వున్న లోట్లను తీరుస్తూ, ఆధ్మాత్మికంగా అతనిలో ఉన్నతిని పెంపొందించడంలో ఎంతో సహాయపడుతుంది. మొత్తానికి పాదరసం పూర్నత్వానికి ప్రతీకగా పేర్కొనవచ్చు.
కేవలం ఆధ్మాత్మికంగానే కాదు… ఆయుర్వేదంలో కూడా దీని ప్రాముఖ్యత గురించి విశ్లేషించబడింది. ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం మర్థనానికి దీనిని ఉపయోగిస్తారు. భస్మం రూపంలో మానవునికి ప్రాణదాయకమైన ఎన్నో రసాలుగా ఉపయోగిస్తారు. అంతేకాకుండా.. తంత్రశాస్త్రంలో కూడా పాదరస మహిమల గురించి వర్ణించబడివున్నాయి. ముఖ్యంగా పాదరస శివలింగాన్ని నిత్యం పూజిస్తే.. అన్నిరకాల దోషాలను సంపూర్ణంగా తొలగించవచ్చని మన హిందూ శాస్త్రాలు తెలుపుతున్నాయి. అందులో ఏయే దోషాలకు ఎటువంటి పూజలు చేయాలో కూడా చెప్పబడి వున్నాయి. వాటి గురించి మనం కూడా ఒకసారి తెలుసుకుందాం…
పాదరస శివలింగ పూజతో కలిగే ప్రయోజనాలు :
1. వాస్తుదోష నివారణ : ఒక తాంత్రికుని చేత మంచి శుభముహూర్తంలో పాదరస శివలింగాన్ని నిర్మింప చేయాలి. దానిని గృహానికి తీసుకవచ్చి పవిత్రమైన ప్రదేశంలో స్థాపించుకోవాలి. ఆ ఇంటి యజమాని ప్రతిరోజూ తూచాతప్పకుండా ఆ పాదరస శివలింగానికి అభిషేకం, అర్చన చేయాలి. ఇలా చేయడం వల్ల గృహంలో వున్న వాస్తుదోషాలు పూర్తిగా సమసిపోతాయి.
2. తాంత్రికదోష నివారణ : సుఖసంతోషాలతో జీవిస్తున్న వ్యక్తులను కొంతమంది అసూయపడుతుంటారు. వారిని ఎలాగైనా ఇబ్బందులకు గురిచేయాలని నిత్యం ఆలోచిస్తూనే వుంటారు. కుటుంబసభ్యల మధ్య కలహాలు ఏర్పడేలాగానీ, వ్యాపారాల్లో నష్టం కలిగించాలని అనేకరకాల ప్రయోగాలు చేస్తారు. అందులో భాగంగానే వారు తాంత్రికులతో దోషాలు కలిగేలా చేస్తారు. కొన్ని సందర్భాలలో ఆ దోషాలు ప్రాణాంతకంగా మారుతాయి. అటువంటి సందేహాలు కలిగినప్పుడు వెంటనే పాదరస శివలింగాన్ని గృహానికి తీసుకువచ్చి పూజా కార్యక్రమాలను ప్రారంభించుకోవాలి. ఈ పూజలు మొదలయిన క్షణం నుంచి తాంత్రికదోషం నుంచి విముక్తి కలిగి, మానసికంగా ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. అతి తక్కువకాలంలోనే ఈ దోషం నుంచి విముక్తి పొందవచ్చు.
3. పితృదోష నివారణ : పితృదోషం నుంచి విముక్తి పొందాలంటే.. పాదరస శివలింగాన్ని ఒక శుభముహూర్తంలో గృహంలో స్థాపించుకుని, ప్రతిరోజూ ఉదయాన్నే అభిషేకం చేసి, పూజలు నిర్వహించుకోవాలి.
4. రోగ విముక్తి : తీవ్రమైన రోగాలతో బాధపడేవారికి ఔషదాలతో కూడిన ఆహారపదార్థాలను అందించడంతోపాటు పాదరస శివలింగాన్ని అభిషేకం చేసిన తీర్థాన్ని ఒక చెంచాడు వరకు తాగించాలి.
5. వివాహబాధ : ఎన్ని వివాహప్రయత్నాలు చేసినా.. అవి నిత్యం విఫలం అవుతుంటే వెంటనే అటువంటివారిని పాదరస శివలింగ సాధన చేయించాలి. భక్తిశ్రద్ధలతో ప్రతిరోజూ ప్రార్థించేలా చేయాలి. ఇలా చేసిన 21 రోజుల్లోనే వివాహ బాంధవ్యం నిశ్చయం ఖచ్చితంగా అవుతుంది.