గయను పూర్వీకుల తీర్థయాత్ర అని ఎందుకు పిలుస్తారు?

గయ తీర్థంలో చేసే పితృ పూజ ప్రాముఖ్యత

ఇసుకతో చేసే శ్రాద్దకర్మ ప్రాముఖ్యత ఏమిటంటే ఎవరైనా గయ తీర్థయాత్రకు వెళ్లి.. తమ పూర్వీకుల పేరు, గోత్రం మొదలైన వాటితో .. తమ పూర్వీకులకు  పిండ ప్రదానం చేస్తే అతను సద్గతిని పొందుతారని విశ్వాసం. అంతేకాదు హిందూ విశ్వాసం ప్రకారం గయ  తీర్థంలో చేసే శ్రాద్ధ క్రతువు మొత్తం తమ కుటుంబంలోని ఏడు తరాల వారిని కలుపుతుందని సంతృప్తి చెందేలా చేస్తుందని నమ్మకం. 

హిందూ మతంలో దైవం అనుగ్రహం కోసం తమకు ఇష్టమైన దేవతలను పూజించడానికి వివిధ క్షేత్రాలకు వెళ్తారు. తీర్థయాత్రలు చేస్తారు. అదే విధంగా పూర్వీకులను ప్రసన్నం చేసుకోవడానికి.. తమ పూర్వీకులకు  మోక్షం కోసం  శ్రాద్ధ కర్మలను, పిండ ప్రదానం, దానాలు వంటి క్రతువులను నిర్వహించడానికి కూడా ఒక ప్రాంతాలన్ని వెళ్లారు. ఇక్కడకు వెళ్లి పూర్వీకులకు శాంతిని చేకూర్చే ప్రక్రియను నిర్వహిస్తారు. అదే గయ.  హిందూ మతంలో గయ అనేది ఒక పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రంలో ఎవరైనా తమ పూర్వీకుల పట్ల భక్తితో , విశ్వాసంతో చేసే శ్రాద్ధ కర్మలు.. పితృ దోషం నుండి విముక్తి చేస్తుందని విశ్వాసం. అందుకనే గయ ధామానికి వెళ్లే ప్రత్యేక సంప్రదాయం ఎప్పటి నుంచో పాటిస్తున్నారు.

ఎవరైనా గయ తీర్థయాత్రకు వెళ్లి.. తమ పూర్వీకుల పేరు, గోత్రం మొదలైన వాటితో .. తమ పూర్వీకులకు  పిండ ప్రదానం చేస్తే అతను సద్గతిని పొందుతారని విశ్వాసం. అంతేకాదు హిందూ విశ్వాసం ప్రకారం గయ  తీర్థంలో చేసే శ్రాద్ధ క్రతువు మొత్తం తమ కుటుంబంలోని ఏడు తరాల వారిని కలుపుతుందని సంతృప్తి చెందేలా చేస్తుందని నమ్మకం.

హిందువుల విశ్వాసం ప్రకారం గయ శ్రీ మహావిష్ణువు నివసించే పవిత్ర పుణ్యక్షేత్రం. పూర్వీకులు దేవుడి రూపంలో శ్రీ విష్ణువు నివసించే పవిత్ర నగరం. పౌరాణిక కాలంలో శ్రీ రాముడు సీతాదేవితో కలిసి గయలో తన తండ్రి దశరథ మహారాజు కోసం ఇక్కడ ప్రత్యేకంగా శ్రాద్ధకర్మలు చేశారని నమ్మకం.

English
Updates
Panchangam
Shop
Telugu