విష్ణుసాలగ్రామ పూజ అంటే ఏమిటి? ఎందుకు చేస్తారో తెలుసా?

సాలిగ్రామ విష్ణు పూజ విశేషము 

సాలగ్రామాలు అంటే సాక్షాత్తు ఆ విష్ణు అవతారమని, ఈ సాలగ్రామ పూజలు నిర్వహించడం వల్ల సర్వ లోకం మొత్తం రక్షించబడుతుంది.

అంతేకాకుండా సమస్త పాపాలు తొలగిపోయి, సుఖ సంతోషాలతో ప్రశాంతంగా ఉంటారని వేదపండితులు తెలియజేస్తున్నారు.అంతేకాకుండా సాలగ్రామాలకు చేసిన అభిషేకాన్ని తీర్థ ప్రసాదంగా సేవించటం వల్ల సమస్త పాపాలు తొలగిపోవడమే కాకుండా, సర్వ వ్యాధులు కూడా తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం.

శాలిగ్రామం.. నలుపు రంగులో ఉన్న పవిత్రమైన రాయి. ఇది విష్ణువు యొక్క దేవత రూపంగా పరిగణించబడుతుంది. శాలిగ్రామ రాయిని సాధారణంగా తులసి మెుక్క ఉన్న చోటే ఉంచుతారు.  

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, శాలిగ్రామాన్ని తులసి మొక్కతో క్రమం తప్పకుండా పూజించడం ద్వారా, సంపదలకు దేవత అయిన లక్ష్మి అనుగ్రహం లభిస్తుంది. తులసి-శాలిగ్రామాన్ని పూజిస్తే.. ఇంట్లో అమ్మ శాశ్వతంగా ఉంటుంది. అలాంటి ఇంట్లో పేదరికం ఎప్పుడూ ఉండదు. 

మీరు శాలిగ్రామాన్ని తులసితో ఉంచకపోతే, మీరు దానిని ఇంట్లో ఏదైనా పవిత్ర స్థలంలో ప్రతిష్టించవచ్చు. 

మీరు శాలిగ్రామాన్ని స్థాపించాలని ఆలోచిస్తున్నట్లయితే, దీపావళి రోజున దానిని స్థాపించడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ముందుగా విష్ణుసహస్రనామ పారాయణ చేస్తూ పంచామృతంతో శాలిగ్రామానికి స్నానం చేయించాలి. దీని తరువాత, భగవంతుని పంచోపచారిని పూజించడం ద్వారా దానిని స్థాపించండి.

 

English
Updates
Panchangam
Shop
Telugu