వాస్తు శాస్త్రం ప్రకారం.. ఒక వ్యక్తి తలరాతను మార్చగల ఎన్నో విషయాలు చెప్పబడ్డాయి. ఇంట్లో కొన్ని మార్పులు, వస్తువులు ఉండటం వల్ల చాలా మార్పులు ఉంటాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. హిందూ శాస్త్రం ప్రకారం ఇంట్లో తాబేలును ఎంతో పవిత్రంగా భావిస్తారు. తాబేలు.. విష్ణుమూర్తి అవతారంగా హిందువులు నమ్ముతారు. అందుకే ఇంట్లో తాబేలును పెడుతూ ఉంటారు. దీని వల్ల లక్ష్మీ దేవి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. అలాగే మరి కొంత మంది తాబేలు ఉంగరం, తాబేలు..
వాస్తు శాస్త్రం ప్రకారం.. ఒక వ్యక్తి తలరాతను మార్చగల ఎన్నో విషయాలు చెప్పబడ్డాయి. ఇంట్లో కొన్ని మార్పులు, వస్తువులు ఉండటం వల్ల చాలా మార్పులు ఉంటాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. హిందూ శాస్త్రం ప్రకారం ఇంట్లో తాబేలును ఎంతో పవిత్రంగా భావిస్తారు. తాబేలు.. విష్ణుమూర్తి అవతారంగా హిందువులు నమ్ముతారు. అందుకే ఇంట్లో తాబేలును పెడుతూ ఉంటారు. దీని వల్ల లక్ష్మీ దేవి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. అలాగే మరి కొంత మంది తాబేలు ఉంగరం, తాబేలు విగ్రహం ఇంట్లో పెట్టడం జరుగుతుంది. ఈ క్రమంలో తాబేలు ఎలా ధరిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి? ఇంట్లో పెట్టడం వల్ల అదృష్టం కలిసి వస్తుందా? ఇప్పుడు చూద్దాం.
తాబేలు ఉంగరం:
చాలా మంది తాబేలు ఉంగరాలను ధరించడం చూసే ఉంటారు. ఎవరి స్థోమతను బట్టి వారు ఆ లోహాన్ని ధరిస్తూ ఉంటారు. తాబేలు ఉంగరం ధరించడాన్ని అదృష్టంగా భావిస్తారు. తాబేలు ఉంగరం ధరిస్తే లక్ష్మీ దేవి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. అయితే ఈ తాబేలు ఉంగరాన్ని.. శుక్రమం, దీపావళి, ధన త్రయోదశి, అక్షయ తృతీయ రోజు ధరిస్తే మరింత మంచిది.
తాబేలు యంత్రం:
చాలా మంది ఇళ్లల్లో తాబేలు యంత్రాన్ని పెట్టడం మీరు గనమించే ఉంటారు. వాస్తు పరంగా చూస్తే తాబేలు యంత్రాన్ని ఇంట్లో ప్రతిష్టించడం వల్ల ప్రత్యేక ప్రయోజనాలు కలుగుతాయి. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోయి.. పాజిటివ్ ఎనర్జీ నెలకొంటుంది. తాబేలు యంత్ర స్థాపనకు శుక్రవారం లేదా పౌర్ణమి తిథి శుభప్రదం. పలు శుభ సమయాల్లో కూడా తాబేలు యంత్రాన్ని పెట్టుకోవచ్చు.
తాబేలు చిత్రం:
మీ వ్యాపారంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా.. ఆర్థిక సమస్యలు ఎదురవకుండా ముందుకు సాగాలంటే.. తాబేలు చిత్రం బాగా ఉపయోగ పడుతుంది. మీ ప్రధాన ద్వారం పై తాబేలు చిత్రాన్ని ఉంచితే.. వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. దీంతో పాటు నెగిటివ్ ఎనర్జీ కూడా తొలగుతుంది. ఇంటి ప్రధాన ద్వారానికి పెడితే.. ఇంట్లో ప్రశాంతత, పాజిటివ్ ఎనర్జీ నెలకొంటుంది.
లోహ తాబేలు:
అలాగే కొందరి ఇళ్లలో మెటల్ తాబేలులు కూడా ఉంటాయి. ఈ లోహాలతో తయారు చేసిన తాబేలును ఉత్తర దిశలో ఉంచడం శుభప్రదం. మీ మనసులో అనుకున్న కోరికలు నెరవేరాలంటే.. వాటిని తెల్ల కాగితంపై రాసి లోహ తాబేలు వద్ద ఉంచితే మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి.