బుధవారం పంచమి సందర్బంగా స్వామిని శ్రీ లక్ష్మీ గణపతిగా ఆరాధించడం వలన విశేష ఐశ్వర్య ప్రాప్తి కలుగును. శ్రీ లక్ష్మీ గణపతికి ప్రీతిగా తామరపువ్వులు, గరికలతో అర్చన చేయడం, కుడుములు లేద రావా ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించడం ఉత్తమం. విశేషించి శ్రీ లక్ష్మీ గణపతి హోమాన్ని చేయడం వలన ధనప్రాప్తి కలుగుతుంది.